...

ఒంగోలు(రాధే సింధూరం)క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ మరియు క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 4 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున స్కాలర్‌షిప్‌లు మరియు ప్రశంసాపత్రాలను మంజూరు చేశారు.ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సహాయ కలెక్టర్ కల్పనా కుమారి , ఐఏఎస్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. జిల్లా సహాయ కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఈ తరహా ప్రోత్సాహకాలు వారికి మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని సహాయ కలెక్టర్ కొనియాడారు.స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థుల్లో చీరాల, ఒంగోలు కి చెందిన ఏ. దివ్య హర్షిత , పి.ధనలక్ష్మి కె. ఉదయభార్గవి , ఎం.స్మైలీ.ఈ కార్యక్రమంలో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ తరఫున డివిజనల్ మేనేజర్ ఎం. జగదీష్, ఏరియా మేనేజర్లు శేగు వెంకట గిరిబాబు మరియు క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ స్టాఫ్ పాల్గొన్నారు.