ముడుపులిస్తే చాలు, నిబంధనలకు అతీతంగా పనులు హరికృష్ణయ చెంతకు చేరుతున్నాయా
చిన్న హరికృష్ణుడు పెద్దసారకు పనులు విలువ తెలిపి ముడుపులు చేరవేరుస్తున్నాడా..?
దృష్టిసారించని ఉన్నతాధికారులు, యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వసూళ్ల పర్వం
రేపల్లె (రాధే సింధూరం )రేపల్లె సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారులకు వీరు వసూల్ రాజాలుగా మెదులుతూ,వీరు కూడా పెద్ద ఎత్తున వెనుకేసుకుంటున్నారనే ప్రచారం ఉంది. కార్యాలయాల్లోని ప్రభుత్వ ఉద్యోగుల విధులను సైతం వీరే నిర్వహిస్తుంటారనే ఆరోపణలున్నాయి. వివాదంలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు కూడా వీరి చేతిలోకి వెళితే పని అయిపోయినట్లే అనే ప్రచారం ఉంది. ఆస్తుల విలువను బట్టి వసూల్ చేసి రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియను సులువుగా పూర్తి చేసి పెడతారని సమాచారం. రిజిస్ట్రార్ కార్యాలయం లో అవినీతి పుంతలతోక్కుతుందని వినికిడి. ఒకటిరెండు మినహా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల హవా కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రైవేటు వ్యక్తులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తోడైనట్లు తెలిసింది. ఉన్నతాధికారుల తనిఖీలు, ఆరోపణలపై సమగ్ర విచారణలు లేకపోవడంతో చాలా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో హరికృష్ణుడు సదరు అధికారి ఆడిందే ఆటపాడింది పాటగా కొనసాగుతుందా. ఉద్యోగులు ఎవరు ప్రైవేటు వ్యక్తులు ఎవరు అని తేడా లేకుండా సంబంధిత బ్రోకర్లు రైటర్లు సహాయంతో ప్రతి ఒక్క పని కొనసాగుతోంది. ప్రతి డాక్యుమెంట్ కు ఒక టార్గెట్ పెట్టుకొని సాయంత్రం కు వసూళ్ల పర్వం లెక్కలు తేల్చి నాయకులకు,అధికారులకు పంపకాలు జరుగుతున్నాయా,సంబంధిత అవినీతి అధికారుల అవినీతి పై ఆధారాలతో మరొక ప్రత్యేక కథనం..