..

బడా నేత అండ ఉందని పొగరా, లేక అధికారం ఉంది కదా అని సంపాదించాలని దూకుడ..?

ఆ ప్రభుత్వ కార్యాల యం దగ్గర పైసా వసూల్ రాజ్యం నడుస్తుందంటే అతిశయోక్తి కాదు

డాక్యుమెంట్ రైటర్లు, సీనియర్ అసిస్టెంట్ల ముసుగులో విడదీయరాని బంధం

పైసలుంటే అడ్డదిడ్డంగా పనులైపోతాయి, సంబంధిత నెంబర్లు సరిగా లేకపోయినా పర్లేదు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కంకణం కట్టుకున్నారా..?

రేపల్లె (రాధే సింధూరం ) రేపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వసూళ్ల రాజా తో నడుస్తుంది అంటే అతిశయోక్తి కాదు. అక్కడ పైసా ఉంటే ఎలాంటి పని అయినా నడిపే బ్రోకర్లు ఏర్పరుచుకుని వసూళ్లకు పాల్పడుతున్న అధికారి తీరుపై సర్వత్ర విమర్శలు కలవు. ఆ కార్యాలయంలో పైసా మే పరమాత్మ అనే విధంగా నడుస్తుందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సంబంధిత డాక్యుమెంట్ రైటర్లలో బంధం ఏర్పరచుకొని అడ్డదిడ్డంగా వసూలు రాజాలు ఉన్నట్లు సమాచారం. పైసలు ఇస్తే కోర్టు పరిధిలోని భూములైన రిజిస్ట్రేషన్లు జరుగుతాయా... కాసులు ఉన్న వారికే అక్కడ పని అవుతుందా అంటే అవును అనే వినిపిస్తుంది ఆ విధంగా అక్కడ బ్రోకర్లు కొందరు డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో పని జరుగుతుందని విమర్శ కలదు. రేపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతి అడ్డాతో కొనసాగుతుంది అనే విమర్శ ప్రజలలో కలదు. సంబంధిత శాఖ కార్యాలయం పై ఎసిబి అధికారులు దాడి చేస్తే అధికారుల ఆస్తుల పర్వం, సీనియర్ అసిస్టెంట్లు, సంబంధిత శాఖ అవినీతి అధికారి బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం కలదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలంటే సంబంధిత అధికారులు చేయతడపాల్సిందే లేదంటే బాధితులకు ఏదో ఒక డాక్యుమెంట్ ఎదుర్కోవాల్సిన అవసరం కనబడుతుంది లేదా కనపడేటట్లు చేస్తారు.సంబంధిత అవినీతి అధికారుల చేసిన అవినీతిపై ప్రత్యేక కథనం